కేంద్రంపై మంత్రి కేటీఆర్ త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు -గ‌డీల శ్రీకాంత్ గౌడ్

Districts politics Telangana

_మంత్రి కేటీఆర్ వ్యాఖ్య‌లను తీవ్రంగా ఖండించిన గడీల శ్రీకాంత్ గౌడ్

_శంకుస్థాపనలు, ప్రచారలకే పరిమితమైన మంత్రి కేటీఆర్

మనవార్తలు ,పటాన్ చెరు:

తెలంగాణ ప్ర‌భుత్వం మాట‌ల‌కే ప‌రిమిత‌మైందని..ఇచ్చిన వాగ్దానాలు నిల‌బెట్టుకోవ‌డం లేద‌ని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గ‌డీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లోని తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత అధికారం లోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని తెలిపారు. దీనికి పటాన్చెరు నియోజకవర్గమే ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌న‌మ‌న్నారు. సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ లు ఇచ్చి కేవలం శంకుస్థాపనలుకే పరిమితమ‌య్యార‌ని విమ‌ర్శించారు. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరు గాంచిన పాషమైలరం పారిశ్రామికవాడలో 4 సంవత్సరాల క్రితం వ్యర్థ జలాల శుద్ధి కేంద్రన్ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తే ఇప్పటి వరకు పనులు మొద‌లుకాలేద‌న్నారు .ఇక్క‌డ నిర్మించిన శిలాఫలకం సైతం మాయ‌మైంద‌న్నారు.

ఇక ఇక్క‌డి పరిశ్రమల ఏర్పాటు ద్వారా 5వేల మందికి ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌న్న మాట ఉత్తిదే అని ఎద్దేవా చేశారు. వారం రోజుల్లో పాషమైలరంకు ఐటిఐ తీసుకు వ‌స్తాన‌ని చెప్పి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి పురోగ‌తి లేద‌ని.. యువతకు ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని చేసిన వాగ్దానాలు కేవలం మాటలకే పరిమితమైయ్యాయ‌ని గ‌డీల శ్రీకాంత్ గౌడ్ విమ‌ర్శించారు.కేంద్రంపై మంత్రి కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నార‌ని గ‌డీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .

పటాన్ చెరులో ఉన్న పారిశ్రమల నుంచి, రియల్ ఎస్టేట్ నుంచి ఎంత ట్యాక్స్ వసూలు చేస్తున్నారో శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు . అందులో పటాన్ చెరు అభివృద్ధి ఎంత ఉపయోగిస్తున్నారో ప్రజలకు తెలియజేయాలన్నారు .పటాన్ చెరువు  శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి  కేవలం తన వ్యాపాలు, కమిషన్లపైనె ద్రుష్టి పెట్టారని, నియోజకవర్గ సమస్యలపై, అభివృద్ధిపై ఏనాడూ మాట్లాడకుండా ఉత్సవ విగ్రహాంగా మారార‌ని ఎద్దేవా చేశారు . ఇప్పటికైనా కేంద్రంపై తప్పుడు ఆరోపణలు మానుకొని  నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని గ‌డీల శ్రీకాంత్ గౌడ్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *