మనవార్తలు ,పటాన్ చెరు:
దేశ వ్యాప్తంగా ప్రజలు ఆదివారం నాడు ఈస్టర్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం అశోకనగర్ వేడుక హాల్లోనూ ఈస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకొని క్రైస్తవ దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా ఆయా క్రైస్తవ దేవాలయాలలో పునరుత్థానుడైన ఏసుక్రీస్తు గూర్చి భక్తి గీతాలు ఆలపించగా, బోధకులు శుభ సందేశాన్ని అందించారు. యేసుక్రీస్తు ప్రభువు మానవాళి పాపాలను సిలువ మీద మోసి మరణించి,తిరిగి లేచి 2022సవంత్సరాలైయ్యిందని, మరియు ఈ రోజు జరిగిన అటువంటి ఆ కార్యాన్ని జ్ఞాపకం చేస్తూ,పునరుద్ధరడుగా చరిత్రలో మరణమును జయించిన వ్యక్తిగా యేసు క్రీస్తు వారు మాత్రమే ఉన్నారని తెలిపారు.

అలయాల్లో జరిగే ఈస్టర్ వేడుకలకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో క్రైస్తవ ఆలయాలకు చేరుకుని ప్రార్థలు చేశారు. ఈస్టర్ పండుగకు ముందు 40 రోజుల పాటు క్రైస్తవులు ఉపవాసం ఆచరించడం వందలాది ఏళ్లుగా ఆచారంగా వస్తోంది ఆ ఉపవాసాలు కూడా ఈస్టర్ పర్వదినం రోజు ముగుస్తాయి అని అని బోధకులు తెలిపారు .ఈ పండుగను పురస్కరించుకుని అన్ని చర్చీలను అందంగా తీర్చిదిద్దారు. శాంతి ,ప్రేమ,కరుణ అలాగే క్షమించే తత్వాన్ని మనo అందరం ఆచరించాలని ,ఆయన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని అకాక్షించారు.ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని మహిమ గలా దేవుడిని స్తుతిస్తూ ఆరాధించారు.ఈస్టర్ ను పురస్కరించుకుని ప్రధాని మోడీ సహా ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
