మనవార్తలు , సంగారెడ్డి :
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బాబా సాహెబ్ అంబేడ్కర్ 131 వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా బీరంగుడా లోని యువజన సంగం ఆధ్వర్యంలో ఫాస్ట్రాక్ ఇంటర్నెట్ సెంటర్ లో అంబెడ్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళాలు అర్పించారు .అనంతరం యువజన సంగంల నాయకులు మాట్లాడుతూ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా, నేటి యువతరానికి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా స్వాతంత్రం అనంతరం దేశంలో అత్యధిక శాతం కలిగిన బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులను పొందుపరిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఆరాధ్య దైవంగా అంబేద్కర్ మారారని అన్నారు.
100 ఏళ్ల క్రితమే బాబా సాహెబ్ అంబేద్కర్ అందరికీ సమానమైన హక్కులున్న రాజ్యాంగాన్ని కానుకగా ఇచ్చారు. అయిదువేల ఏళ్ల నాటి అభిప్రాయాలను నేడు అమలు చేయాలని చూస్తే దాన్ని మళ్లీ తగలబెడతాం, కానీ దేశం పేరు మీద మతం పేరు మీద మరల మన సంస్కృతి ని అనధికారికంగా అమలు చేస్తున్నారు.ఇది అందరికీ తెలుసు కానీ అందరూ అంబేడ్కర్ తోవలో నడవాలని. అంభేడ్కర్ బాట అందరికి చూపాలని తెలిపారు కార్యక్రమంలో వినయ్ కుమార్,విజయ్ రాజ్,సంజీవ,శ్రీశైలం,జనార్దన్,ఎరుపుల మహేష్,అనిల్ సింగ్,సాయికిరణ్ ,జీ. శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.