మనవార్తలు,శేరిలింగంపల్లి :
చిన్నప్పటి నుండే ఇతరులకు సాయం చేయడం అలవర్చుకోవాలని జ్యోతి విద్యాలయ హై స్కూల్ ఫాదర్ ఆంబ్రోస్ బెక్, ప్రిన్సిపాల్ ఉమా మహేశ్వరి లు అన్నారు. తమ స్కూల్ లో థర్డ్ క్లాస్ చదువుతున్న సాయిభువనేశ్వర్ పుట్టినరోజు సందర్భంగా స్కూల్ లో పని చేస్తున్న ఆయమ్మ లకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో డబ్బులున్న వారు చాలా మంది ఉంటారు. కానీ ఇలా సాయం చేసే గుణముండదని, ఇలా ఒకరికి ఒకరు సాయం చేసుకుంటుంటే ధనిక పేద అనే భేదం ఉండదని అన్నారు. చిన్నప్పటి నుండి పిల్లలకు చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ, ధానగుణo నేర్పించాలని పేర్కొన్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజుల పేరుతో డబ్బును ఆడంబరాలకు వెస్ట్ చేయకుండా, ఇలా సేవా కార్యక్రమాలకు ఉపయోవిస్తే సమాజానికి కొంత ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు.