– పెంచిన చమురు, నిత్యవసర ధరలు వెంటనే తగ్గించాలి
– జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టిన కాంగ్రెస్ నాయకులు
మనవార్తలు ,పటాన్చెరు:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలపై భారం మోపుతున్నాయని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి గాలి అనిల్ కుమార్, పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ లు ఆరోపించారు. టీపీసీసీ పిలుపు మేరకు పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్, నిత్యవసర ధరలను వ్యతిరేకిస్తూ సోమవారం వారు పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలతో సామాన్య ప్రజలు బ్రతకలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్, నిత్యవసర ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరలను పెంచుతూ ప్రజలకు మరింత కష్టపెడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పెంచిన ధరలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సపానదేవ్, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ రవీందర్ గౌడ్, వైస్ ఛైర్మెన్ అనిల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ మండల ప్రెసిడెంట్స్ శ్రీకాంత్ రెడ్డి, వీరారెడ్డి, భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి మైనారిటీ ఛైర్మెన్ హబీబ్ జానీ, ఎస్సీ సెల్ డిపార్ట్మెంట్ యాదగిరి, మహేష్, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.