పటాన్చెరు బస్ స్టాండ్ లో చలివేంద్రం ప్రారంభం
మనవార్తలు,పటాన్‌చెరు:
సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని బస్టాండ్ ప్రాంగణంలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నిరంతరం వేలాదిమంది రాకపోకలు సాగించే బస్టాండ్లో చలివేంద్రం ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చడం పట్ల అభినందనలు తెలియజేశారు. అనంతరం సత్య సాయి బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, వంగరి అశోక్, సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.