ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న ప్రధాని మోడీ_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Districts politics Telangana

_దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా పటాన్చెరులో భారీ నిరసన కార్యక్రమం

_మద్దతు పలికిన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు

మన వార్తలు ,పటాన్ చెరు:

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోనీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రెండు రోజులు సార్వత్రిక సమ్మెకు మద్దతుగా టిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ రహదారిపై భారీ రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాల కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా పని చేస్తోందని అన్నారు.

నిత్యావసర ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్న అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు విక్రయిస్తూ కార్మికులను బానిసలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. కార్మికుల పాలిట శాపంగా మారిన లేబర్ కోడ్ ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, జిల్లా అధ్యక్షుడు శివ శంకర్, నర్రా బిక్షపతి, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, విజయ్ కుమార్, కార్మిక విభాగం నాయకులు భాస్కర్ రెడ్డి, మాధవరావు, వెంకట్రావు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *