– గీతం అధ్యాపక వికాస కార్యక్రమంలో వక్తల అభిభాషణ
మన వార్తలు ,పటాన్ చెరు:
ఎలక్ట్రానిక్స్ మెటీరియల్ రంగంలో మనం ఇంకా ఎంతో వెనుకబడి ఉన్నామని , ఆ రంగంలో ఔత్సాహిక యువత చేయాల్సింది ఎంతో ఉందని గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అధ్వర్యంలో మార్చి 23-25 వరకు ‘ భౌతిక , మిశ్రమ పదార్థాల ఆధునిక పోకడల’పై నిర్వహిస్తున్న అధ్యాపక వికాస కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది . ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన ప్రోవీసీ మాట్లాడుతూ , యంత్రం రూపొందించే ఏ వ్యక్తికైనా భౌతిక పదార్థాలు చాలా ముఖ్యమైన అంశమని , వారి వద్ద నుంచి మెటీరియల్ ఉంటే తప్ప నుంచి పనిముట్టును రూపొందించలేరని వ్యాఖ్యానించారు .

ఎందుకంటే అయా మెటీరియల్ రకరకాల ఉష్ణోగ్రతలు , భారాలను తట్టుకోవాల్సి ఉంటుందన్నారు . ఈ అధ్యాపక వికాస కార్యక్రమంలో పాల్గొన్నవారిలో కొందరెనా అభివృద్ధి చెందిన దేశాలకు సమానంగా మన మెటీరియల్ రంగాన్ని తీసుకెళ్ళేలా కృషిచేయాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన నొక్కిచెప్పారు . ఎఫ్ఎపీలో తొలి కీలకోపన్యాసం గీతం ఇంజనీరింగ్ డీన్ విజయశేఖర్ చల్లబోయిన చేశారు . అత్మీయ అతిథి , గీతం బెంగళూరులోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డెరెక్టర్ ప్రొఫెసర్ దినేష్ సేథీ మాట్లాడుతూ , పరిశోధనా ఫలాలను సదస్యులకు అందించడంలో ఈ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు . కోనిడ్ -19 నేపథ్యంలో నిర్వహించిన ఆన్లైన్ కార్యక్రమాల కంటే భౌతికంగా నిర్వహిస్తున్న ఇది ఎంతో ప్రయోజనకరమైందని ఇంజనీరింగ్ డెరైక్టర్ ప్రొఫెసర్ నీకే మిట్టల్ అభిప్రాయపడ్డారు . తొలుత , ఈ అధ్యాపక వికాస కార్యక్రమ లక్ష్యాలను మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ పి.శ్రీనివాస్ తన స్వాగతోపన్యాసంలో వివరించారు .

ఈ మూడు రోజుల కార్యక్రమంలో రెండు ప్రయోగాత్మక కార్యక్రమాలతో పాటు విద్యా – పారిశ్రామి రంగాలకు చెందిన నిపుణులతో నాలుగు కీలకోపన్యాసాలు , ఐదు ఆహ్వానిత చర్చలు ఉంటాయని వందన సమర్పణలో డాక్టర్ వి.జీవన్ వెల్లడించారు . గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరెక్టర్ ప్రొఫెసర్ ఎస్.సీతారామయ్య , సెస్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , ప్రొఫెసర్ సి.ఈశ్వరయ్య , పలువురు అధ్యాపకులు , విద్యార్థులు , దాదాపు 50 మంది ప్రతినిధులు పాల్గొన్నారు . గీతమ్లో ఘనంగా సంప్రదాయ వస్త్రధారణ దినోత్సవం ‘ సరంపర ‘ పేరిట ప్రతియేటా నిర్వహించే సంప్రదాయ వస్త్రధారణ దినోత్సవాన్ని ( ఎత్నిక్ డే ) బుధవారం గీతమ్ ఘనంగా నిర్వహించారు . ఈ వేడుకలలో భాగంగా వివిధ రాష్ట్రాలు , దేశాల సంస్కృతులు , సంప్రదాయాలను ప్రతిబింబించేలా విద్యా సంప్రదాయ దుస్తులు ధరించి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు . గీతం అధ్యాపకులు , సిబ్బంది కూడా విద్యార్థులను అనుసరించడంతో ప్రాంగణముంతా శోభాయమానం అయింది . ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , ప్రొఫెసర్ నీకే మిట్టల్లు ఈ వేడులను లాంఛనంగా ప్రారంభించారు . ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన రంగోలీ , ర్యాంప్ వాక్ , థోల్ , మ్యూజికల్ తంబోలా , చెవులూరించే ఆహార పదార్థాల స్టాళ్ళు అందరినీ ఆకట్టుకోవడంతో పాటు అలరించాయి .
