మనవార్తలు,శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియపూర్ డివిజన్ పరిధిలోని మక్తా గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు నాయకులు, స్నేహితులు, బీజేపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో మియపూర్ లోని ఆర్ టి సి కాలనిలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు రవికుమార్ యాదవ్, నాగేశ్వర్ గౌడ్, శ్రీశైలం కురుమ లు కేక్ కట్ చేసి గణేష్ ముదిరాజ్ ను సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టిన రోజువేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాజ్ రావు శీను, గంగారం మల్లేష్, జాజెరావు రాము, ఆకుల లక్ష్మణ్, రెపన్ వెంకటేష్, రవీందర్, వంశీ, దినేష్, శివా, శ్రీధర్, దుర్గేష్, నారాయణ, నాని, సిద్దు, వెంకటేష్ బి రమేష్ తదితరులు పాల్గొన్నారు.