సమ్మక్క,సారక్కలను అవమానించిన చినజీయర్ స్వామిపై అట్రాసిటీకేసు నమోదు చేయాలి -అఖిల భారత బంజారా సేవసంఘం డిమాండ్

Hyderabad politics Telangana

మనవార్తలు శేరిలింగంపల్లి :

ఆదివాసి దేవతలైన సమ్మక్క, సారక్క లు దేవతలే కాదని, వారిని కోట్లాదిమంది ఆరాధించడం ఏమిటని తీవ్రంగా అవమానించిన చిన జీయర్ స్వామి ని అరెస్ట్ చేసి అతని పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని అఖిల భారత బంజారా సేవ సంఘo రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కోట్లాది మంది ప్రజలు సమ్మక్క-సారక్క లను ఎందుకు ఆరాధిస్తారని వాళ్లు దేవతలు కాదని వాళ్ళు అడవిలో ఒక సామాన్యమైన వారని, అటువంటి వారికి కోట్లాది రూపాయలు ముడుపులు ఎందుకు సమర్పిస్తున్నారని అవహేళన చేస్తూ, కించపరుస్తూ చిన్న జీయర్ స్వామి మాట్లాడారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల అండదండలతో దొంగ డేరా బాబా గా మారి భక్తి ముసుగులో దేవుడే కానీ రామానుజుల వంటి వారి విగ్రహం పెట్టీ వేల కోట్ల రూపాయలు దోపిడీకీ పాల్పడుతున్నాడు. సామాన్యమైన టైపిస్ట్ ఉద్యోగం చేస్తూ అంచలంచలుగా చిన్న జీయర్ అవతారమెత్తి ఒక దొంగ డేరా బాబా గా మారి వేల కోట్ల సామ్రాజ్యాన్ని విస్తరించమని ఏ పురాణాల్లో వ్రాశారో చెప్పాలి.

బ్రాహ్మణ దేవతలే దేవతలని మిగిలిన కింది కులాల దేవతలందరూ దేవతలు కాదని అహంకార, ఆధిపత్య, మనువాదం తో మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. దేవతలలో కూడా బ్రాహ్మణ దేవతలు ఉన్నారని చెప్పి దేవతలలో కూడా ఆధిపత్య దేవతలు అనగారిన కులాల దేవతలు ఉన్నారని వక్రభాష్యం చెప్పడం చిన్న జీయర్ స్వామిలాంటి దొంగ బాబా లకే సాధ్యం. ఆదివాసీ గిరిజన సమాజాల్లో అడవుల్లో నివసిస్తున్న తమ వారి కోసం ప్రాణాలకు తెగించి పోరాడి అమరులైన వారిని దేవతలుగా కొలిచే సాంప్రదాయం ప్రాచీన కాలం నుండి వస్తున్నది. అటువంటి ఆదివాసి గిరిజన దేవతలకు అతీత శక్తులు ఉంటాయని కోట్లాది మంది ప్రజల నమ్మకం. వారి నమ్మకాలను కించపరుస్తూ అవహేళన పరచడం చిన్న జీయర్ స్వామి లాంటి దొంగ బాబాలకు చరిత్ర గురించి ఏమాత్రం అవగాహన లేదని తెలుస్తున్నది.

పురాతన ఋగ్వేదం నుండి వైదిక పురాణ గ్రంథాలన్నిటిలోనూ ఆదివాసి వీరుల పోరాటం, దేవతలుగా కొలిచిన పద్ధతి గురించి చెప్పబడింది. బ్రాహ్మణ దేవతలు ప్రత్యేకంగా ఉన్నారని ఎక్కడ రాయబడ లేదు. పురాణాలను అవపోశన పట్టిన ఈ దొంగ బాబా కు తెలియంది కాదు. కావాలనే కింది కులాల దేవతలను అవమానించడం వలనా బ్రాహ్మణ దేవతలను ఆరాధించే ప్రజలు పెరిగి చిన్న జీయర్ స్వామి లాంటి దొంగ బాబాల ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలనే కుట్రలో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశంలో మనువాద భావజాలాన్ని తిరిగి ప్రతిష్టించాలని చూస్తున్న సంస్థలకు ఊతం ఇచ్చేదిగా చిన్న జీయర్ స్వామి మాటలు ఉన్నాయన్నారు. సమ్మక్క, సారక్క లను కించపరుస్తూ అవహేళన చేసిన చిన్న జీయర్ స్వామి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణం అరెస్టు చేయాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ముచింతల వ్యాపార సామ్రాజన్ని ముట్టడిస్తం జాగ్రత్త అన్ని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *