మనవార్తలు,పటాన్ చెరు:
మూడు కోట్ల రూపాయల వ్యయంతో పటాన్ చెరు నడిబొడ్డున నిర్మించిన గాంధీ పార్క్ ను అతి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించనున్నట్లు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్యతో కలిసి పార్కులో చేపడుతున్న పనులను పరిశీలించారు. వచ్చే వారం రోజుల్లోగా అన్ని పనులు పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అతి త్వరలో పటాన్చెరు కి ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారని, ఆయన చేతుల మీదుగా పార్కును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, నగేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.