–ఎండిఆర్ ఫౌండేషన్ ద్వారా విస్తృత సేవాలు
మనవార్తలు ,పటాన్ చెరు:
సామాజిక సేవ కార్యక్రమాల నిర్వహిస్తున్న ఎండీఆర్ ఫౌండేషన్ ,ప్రతి పేదవారికి తోడుగా నిలబడతానని మానవ సేవే మాధవ సేవాగా మరో సారి ఇంటి నిర్మాణానికి రూ.20 వేలు ఆర్థిక సహాయం అందజేసి తన ఉదారత చాటుకున్నారు.పటాన్చేరు జిహెచ్ఎంసి డివిజన్ బండ్ల గూడ పరిధిలోని లక్ష్మి అన్నా నేను ఇళ్లు కట్టుకుంటున్న సాయం కావాలే అని అడగగానే వెంటనే స్పందించి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేసి పెద్ద మనసు చాటుకున్నారు.ఈ సందర్భంగా ఎండిఆర్ పౌండేషన్ ఛైర్మన్ దేవేందర్ రాజు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు పెద్ద కొడుకుగా అండగా వుంటానని తెలిసిపారు.కార్యక్రమంలో బండ్లగూడ మాజీ ఉపసర్పంచ్ జంగులు, ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు, ప్రణీత్, విక్రమ్ పాల్గొన్నారు.