ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు
మనవార్తలు , పటాన్ చెరు:
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 25 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించడంతో పాటు 55 గ్రామపంచాయతీలకు 20 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేస్తూ నారాయణఖేడ్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన చేయడం పట్ల పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి ల సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు.