గీతమ్ రేడియోకెమిస్ట్రీపై జాతీయ కార్యశాల….

Districts politics Telangana

మనవార్తలు , పటాన్ చెరు:

గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ఆధ్వర్యంలో ఏప్రియల్ 4-8 తేదీలలో ‘ రేడియోకెమిస్ట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ ‘ అనే అంశంపై ఐదురోజుల జాతీయ కార్యశాలను నిర్వహించనున్నట్టు కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ టి.విశ్వం , డాక్టర్ నరేష్ కుమార్ కటారీలు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . భారతీయ అణు రసాయన శాస్త్రవేత్తల సంఘం ( ఐఏఎన్సీఏఎస్ ) సహకారంతో నిర్వహిస్తున్న ఈ 102 వ వర్క్షాప్లో వివిధ విద్యా సంస్థల అధ్యాపకులు , పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తలను ఒక వేదికపైకి తీసుకొచ్చి , పరస్పర సహాయ సహకారాలు అందించుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు .

అణు రసాయన శాస్త్రం , అణు భౌతిక శాస్త్రం , అణు రియాక్టర్ , రేడియో ఐసోటోప్ల ఉత్పత్తి – వినియోగం , ఆరోగ్యం – భద్రత వంటి అంశాలలో ప్రముఖ శాస్త్రవేత్తలు , నిపుణులు ఈ కార్యశాలలో ప్రధాన వక్తలుగా పాల్గొంటారని వారు తెలియజేశారు . ప్రాథమిక , అణు శాస్త్రాలలో పరిశోధనా నిధుల అవకాశాలపై ప్రత్యేక చర్చాగోష్టిని కూడా నిర్వహిస్తామన్నారు . ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఇచ్చే ధ్రువీకరణలు స్వల్పకాలిక కోర్సుగా కూడా గుర్తింపు ఉంటుందని తెలిపారు .

అణు శాస్త్రం – సాంకేతికత , రసాయన , భౌతిక శాస్త్రాలతో పాటు బయోసెన్స్డ్ / బయో – టెక్నాలజీ , హెల్త్ – ఫార్మా స్యూటికల్ సెన్స్లను బోధించే అధ్యాపకులు , ఆయా రంగాలలో పరిశోధనలు నిర్వహిస్తున్న శాస్త్రవేత్తలు , పరిశోధక విద్యార్థులు ఈ కార్యశాలలో పాల్గొనడానికి అర్హులన్నారు . వారు వెయ్యి రూపాయల రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని సమన్వయకర్తలు తెలియజేశారు . ప్రత్యేక రుసుము చెల్లించే వారికి తొలి ప్రాధాన్యం పద్ధతిలో వసతి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు . ఇతర వివరాల కోసం vtalloju@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని , లేదా 98480 92307 / 91777 12000 లను సంప్రదించాలని వారు సూచించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *