_బంజారాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ,పటాన్ చెరు:
బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ బోధనలు నేటి తరానికి అనుసరణీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో సంత్ శ్రీ శ్రీ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ 283 వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని బంజారాల అభివృద్ధి కోసం త్వరలో 500 గజాల స్థలాన్ని కేటాయించనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఆయా తండాలలో సేవాలాల్ మహారాజ్, భవాని మాత దేవాలయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు.