మనవార్తలు ,శేరిలింగంపల్లి :
రంగారెడ్డి జిల్ల శంకర్ పల్లి మండలంలోని అంతప్పగూడ అనే గ్రామంలో శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున దేవాలయంలో జరిగిన శివపర్వతుల కల్యాణ మహోత్సవ పూజలో భాగంగా కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ మరియు టిఆర్ఎస్ పటాన్ చెరు సర్కిల్ 22 బీసీ సెల్ ప్రెసిడెంట్ కంజర్ల కృష్ణమూర్తి చారి మరియు రాజేందర్ చారి లు సోమవారం నాడు ఆలయాన్ని సందర్శించి అన్నదానం కొరకు 5,121 రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్బంగా కంజర్ల కృష్ణమూర్తి చారి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఇలాంటి అధ్యాత్మిక కేంద్రాలను ఏర్పాటు చేస్తే భక్తి భావం, సేవా భావం చిన్ననాటినుండే పిల్లల్లో అలవాటు అవుతుంది అన్నారు.కాబట్టి ప్రతిఒక్కరు కూడ దైవ చింతన ను అలవరచుకుంటే మనసుకు ప్రశాంతత సేవాకార్యక్రమాలలో పాల్గొంటే పుణ్యం లభిస్తుందని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఆంథగోని నర్సింహా గౌడ్, శంకర్ పల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్. నరేష్ కుమార్, ఫౌండేషన్ సభ్యులు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.