ఏగోలపు సదయ్య గౌడ్ కు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ -2022 అవార్డు *

Districts politics Telangana

మనవార్తలు ,సుల్తానాబాద్:

పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్.ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాల నుండి చేస్తున్న సేవాకార్యక్రమాలకు గాను ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ గారికి స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ – 2022 అవార్డును నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ అధ్యక్షులు డాక్టర్ బిఎంజి అర్జున్, బింగి నరేందర్ గౌడ్  హైదరాబాద్ లో తెలంగాణ సారస్వత పరిషత్ లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా  వేణుగోపాల్ చారి ,జస్టిస్ బూర్గుల మధుసూదన్ , విజయ లక్ష్మీ , చంద్రవదన్ ఐఏఎస్  చేతుల మీదుగా స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ 2022 అవార్డును ఆదివారం సాయంత్రం అందజేశారు .ఈ సందర్భంగా ట్రస్టు అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ మాట్లాడుతూ కరోన సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు చేసిన సేవలను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసిన నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *