పటాన్చెరు/అమీన్పూర్
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం పటాన్చెరు మండల పరిధిలోని రామేశ్వరంబండ ఆర్ కె నగర్ 1 కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో నిర్మించిన స్టోర్ రూమ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంతి రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, ఇంద్రేశం సర్పంచ్ నర్సింలు, స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.
పటేల్ గూడ లో..
అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామ పరిధిలోని బీహెచ్ఈఎల్ మెట్రో ఎంక్లేవ్ లో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయ నూతన దివ్య పరివార విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, సంఘ ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు.