మనవార్తలు ,జిన్నారం
అథ్యాత్మిక చింతనతో ఎల్లప్పుడూ మనసు ప్రశాంతంగా ఉంటుందని చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో నిర్వహిస్తున్న ఆదినారాయణ స్వామి వారి వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా బీష్మ ఏకాదశి పురస్కరించుకుని నిర్వహించిన స్వామివారి రథోత్సవంతో పాటు ఇతర ప్రత్యేక పూజకార్యక్రమాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ దేవాలయం పురాతన దేవాలయం అని ఇప్పటికీ బ్రహోత్సవాలకు ఎక్కడెక్కనుంచో వచ్చి స్వామివారిని దర్శించుకుంటురని మధు ముదిరాజ్ తెలిపారు. ఈ సందర్బంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు సర్పంచ్ మధు ముదిరాజ్‌ను శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ ట్రస్టీ ఛైర్మన్ రామోజీరావు, సర్పంచి శివరాజ్ ముదిరాజ్, ఉపసర్పంచి అభిలేష్గౌడ్, తెరాస గ్రామ ప్రెసిడెంట్ సాయిగౌడ్, బిక్షపతి, వెంకటేష్, నాగరాజు, సత్యనారాయణ, సురేష్, ఎన్ఎమ్ఎమ్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

