ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో బీసీ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు వినతి
మనవార్తలు ,పటాన్చెరు
రాష్ట్రంలోని వీరబద్రియ కులస్తుల కోసం ఆత్మగౌరవ భవనం మంజూరు చేయాలని కోరుతూ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో వీరబద్రియ కమిటీ బృందం బుధవారం రాష్ట్ర బీసీ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం లోని అన్ని కులాలవారికి ఆత్మగౌరవ భవనం కోసం స్థలం, నిధులు కేటాయిస్తున్నారని, ఈ నేపథ్యంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబాటుకు గురువైన వీరబద్రియ సంక్షేమం కోసం కృషి చేయాలని వారు కోరారు.
ఇందుకు మంత్రి గంగుల కమలాకర్ సానుకూలంగా స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకుని వెళ్తామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు చవ్వ పాండు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మల్లేష్, యాదయ్య, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.