శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కరపత్రం ఆవిష్కరణ.

Districts politics Telangana

మనవార్తలు , పటాన్ చెరు:

పటాన్ చెరు మాజీ సర్పంచ్, టిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు తన సొంత నిధులతో శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయంన్ని నిర్మించారు.ఈ ఆలయ దేవతా ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట లకు సంబంధించిన కరపత్రాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు ఎల్లమ్మ దేవతా ప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 10వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటలకు మాదిరి తులసిలక్ష్మి దేవేందర్ రాజు ముదిరాజ్ దంపతుల చేతుల మీదుగా జరుగుతుంది అని తెలిపారు.

9వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు గణపతి పూజ, పుణ్యావాచనం, రక్షబందనం, పంచకవ్యసనం, జలాదివాసం కార్యక్రమాలు ఉంటాయి. సాయత్రం : అంకురారోపణ, దేవత ఆవాహన, అగ్నిప్రతిష్ఠపన, క్షీరాదీవాసం నిర్వహించబడుతుంది. 10వ తేదీ ఉదయం 8 గంటలకు సర్వలోచద్రమండలి పూజా, దేవతహోమాలు, ధన్యాదివాసము, సాయత్రం  హోమాలు చతుర్వేధ స్వస్తి, అదివాసాలు, పుష్పాదివాసం, ఫలాదివాసం, శయనాదివాసు, 11వ తేదీ ఉదయం 8 గంటలకు దేవాతప్రతిష్ఠ, కళ్యానాము, పూర్మహుతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని దేవేందర్ రాజు ముదిరాజ్  ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో నందన్ రతన్ ప్రైడ్ కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు రమణ రెడ్డి, కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *