ఏపీ ఆర్టీసీ సమ్మె సైరన్..ఆగిపోనున్న బస్సులు

Andhra Pradesh Districts politics

మన వార్తలు ,అమరావతి:

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య పీఆర్సీ రగడ కొనసాగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ ఉద్యోగులు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 6న అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు కూడా ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ ఎండీకి ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక మెమోరాండం సమర్పించింది.ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావును కలిసి తాము సమ్మె విషయంపై మెమోరాండం అందించినట్లు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక నేతలు వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న 45 సమస్యలతో కూడిన మెమోరాండాన్ని ఎండీకి అందించామన్నారు. తమ సమస్యలు సత్వరమే పరిష్కరించాలని మెమోరాండంలో పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు వెళ్తామని ఎండీకి తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక నేతలు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *