_కార్యకర్తలకు అండగా టిఆర్ఎస్ పార్టీ
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ,పటాన్ చెరు:
దేశంలోని మొట్టమొదటి సారిగా కార్యకర్తలకు ప్రమాద బీమా చేయించి, అకాల మరణం చెందితే రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన ఐదుగురు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇటీవల వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. వీరందరూ పార్టీ అందించిన బీమా సౌకర్యాన్ని కలిగి ఉండడంతో ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా మంజూరైంది.
ఈ మేరకు మంగళవారం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ కార్యకర్తల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి భీమా సౌకర్యం అందించడం జరిగిందన్నారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకునే ఏకైక పార్టీ టిఆర్ఎస్ అన్నారు.
కార్యకర్తల సమిష్టి కృషితోనే నేడు టిఆర్ఎస్ పార్టీ రెండుసార్లు అధికారం చేపట్టిందనీ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మంది కార్యకర్తలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి కెసిఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, గుమ్మడిదల జడ్పిటిసి కుమార్ గౌడ్, భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, వెంకటేష్ గౌడ్, హనుమంత్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, విజయ్ కుమార్, షేక్ హుస్సేన్, రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ చారి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.