_స్వచ్ఛ ఆటోలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్ చెరు
కాలనీలలో పరిశుభ్రత పచ్చదనం పెంపొందించాలంటే ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో జీహెచ్ ఎంసీ ఆధ్వర్యంలో 40 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన ఐదు స్వచ్ఛ చెత్త సేకరణ ఆటోలను స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఆయన ప్రారంభించారు. పటాన్చెరు డివిజన్ కి రెండు, రామచంద్రాపురం డివిజన్ కి రెండు, భారతి నగర్ డివిజన్ కు ఒక ఆటో కేటాయించినట్లు తెలిపారు.
మూడు డివిజన్లలో ప్రస్తుతం 87 స్వచ్ఛ ఆటోలు చెత్తను సేకరిస్తున్నాయనీ తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరిన్ని చెత్త సేకరణ ఆటోలు, రిక్షాలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకూడదని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, డిప్యూటీ కమిషనర్ బాలయ్య, కష్టం మెడికల్ ఆఫీసర్ రంజిత్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.