హాజరైన ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి
మనవార్తలు ,పటాన్ చెరు:
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని టిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం పటాన్చెరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పటన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని అన్ని కాలనీల మహిళలు కార్యక్రమంలో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ సతీమణి మెట్టు రమాదేవి, గూడెం కల్పన మధుసూదన్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, మహిళా విభాగం అధ్యక్షురాలు మాధవి, బీసీ విభాగం సర్కిల్ అధ్యక్షులు కృష్ణమూర్తి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.