శివాలికి మరో ఆరు యూనిక్ వరల్డ్ రికార్డులు…

Districts politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు:

ఇప్పటికే 13 గిన్నిస్ , 15 అసిస్ట్ , నాలుగు యూనిక్ వరల్డ్ రికార్డులు సాధించి , అదే ఓ రికార్డుగా వినుతికెక్కిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రీ శ్రీవాస్తవ తాజాగా మరో ఆరు యూనిక్ వరల్డ్ రికార్డులను సాధించింది . ఆమె తల్లిదండ్రులు కవితా జోహ్రీ శ్రీవాస్తవ , అనిల్ శ్రీవాస్తవలతో కలిసి హ్యాండ్మేడ్ పేపర్తో రూపొందించిన 2,111 క్విల్లింగ్ డాల్స్ , 1,111 ఆభరణాలతో పాటు ఆరెగామీ పేపర్తో రూపొందించిన 9,200 చేపలు , 1,145 మేష్లీ ఆకులు , 2,300 నిమ్మతొనలు , 3,501 వేల్స్ లు ఒకచోట ఉంచగా , దానిని ప్రపంచంలోనే అతి పెద్ద ప్రదర్శనగా గుర్తించి , యూనిక్ వరల్డ్ రికార్స్ వారు ఆమేరకు ధ్రువీకరణ పత్రాలను పంపారు . తాజాగా ఆరు యూనిక్ వరల్డ్ రికార్డులను సాధించిన శివాలీ , ఆమె తల్లిదండ్రులను గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , పలువురు అధ్యాపకులు , విద్యార్థులు అభినందించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *