మనవార్తలు ,పటాన్ చెరు :
దశాబ్దాలుగా రాళ్ళు కొట్టి జీవనం సాగిస్తున్న వడ్డెర కులస్తులు నేడు క్రషర్ ల వల్ల జీవనాధారం కొల్పోతున్నారని పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు బుధవారం కర్మాన్ ఘాట్ లో జాతీయ బీసీ కమిషన్ (ఎన్‌సీబీసీ) సభ్యులు తల్లోజు ఆచారిని కలిసి క్రషర్ కంపెనీలపై ఫిర్యాదు చేశారు.

పటాన్ చెరువు నియోజకవర్గంలో అనేక క్రషర్ కంపెనీలు ఉన్నాయని ఆ కంపెనీలు చుట్టుపక్కల వడ్డెర కులస్తులను రాళ్ళు కొట్టుకోనియకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పోలీసులు, రెవెన్యూ అధికారులు ,అక్రమ మైనింగ్ చేస్తున్న క్రషర్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ నిరక్షరాస్యులైన వడ్డెర కులస్తులను పని చేయకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వీటి వల్ల వడ్డెర కులస్తులకు జీవనాధారం లేకుండా పోయిందని, క్రషర్ కంపెనీలు వడ్డెర కులస్తులను అణిచివేస్తున్నారని ,
వెంటనే బీసీ కమిషన్ జోక్యం చేసుకుని వడ్డెర కులస్తులను ఆదుకోవాలని ,వడ్డెర కులస్తులకు కూడా రాళ్ళు కొట్టుకునే హాక్కును కల్పించాలని పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
