మనవార్తలు ,అమీన్ పూర్
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా అమీన్ పూర్ మండల్ బీజేవైయం ప్రెసిడెంట్ వడ్ల మణికంఠచారి ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తలు ధర్నా నిర్వహించారు .ఈ సందర్బంగా బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు అంకగల్ల సహదేవ్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అక్రమ అరెస్టుల కు భయపడేదిలేదని నిబంధనలు కేవలం విపక్షాలకే వర్తిస్తాయా అని ప్రభుత్వ మొండి వైఖరిని కండిస్తూ బండి సంజయ్ అన్న గారిని వెంటనే విడులచేయలని కోరారు .ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317 వెంటనే సవరించాలని లేదంటే పెద్దఏత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
అనంతరం వడ్ల మణికంఠ చారి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అణిచివేత ధోరణి సరికాదని , బిజెపి కార్యకర్తలు శాంతియుంతంగా ఉద్యోగులకు మద్దతు తెలుపుతూ దీక్షకు దిగితే పోలీసులు కార్యకర్తలపై లాఠీ చార్జి చేయడం దారుణమని అన్నారు కెసిఆర్ కి ప్రజలు బుద్దిచెప్పే రోజులు దగ్గరపడ్డాయని ,రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని భయం కెసిఆరేకు పట్టుకుందని అందుకే ఎంపీ బండి సంజయ్ పై అక్రమ కేసులు పెడుతున్నారని వెంటనే బండి సంజయ్ ను విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోనళకు దిగుతామని బీజేవైయం ప్రెసిడెంట్ వడ్ల మణికంఠచారి అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రవీందర్ రెడ్డి అన్న గారు , మేఘన రెడ్డి , ఓ బీ సీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారు, కంజర్ల చంద్ర శేఖర్,కమ్మరి చంద్రయ్య చారి , బీజేపీ కార్యకర్తలు పాల్గోన్నారు.