మనవార్తలు , పటాన్ చెరు:
హిందూ ఆలయాల నిర్మాణం, అభివృద్దికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని మాజీ జెడ్పీటీసీ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో క్యాసారం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణం కోసం విరాళం అందించారు. గ్రామాన్ని కాపాడే దేవత అయినటు వంటి ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణంకు 2,50,000 నగదును అందించారు. గుడి నిర్మాణానికి తనవంత సాయంగా కొంత మొత్తంను అందిచానన్నారు .ఆలయ నిర్మాణంకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. దాతల సహకారంతోనే గ్రామం, ఆలయం అభివృద్ది సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్యాసారం గ్రామ గౌడ సంఘం సభ్యులు శివాజీ యూత్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు