మరోసారి ఉత్తమ సమీక్షకుడిగా డాక్టర్ హేమరాజు…

Districts politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు:

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ పనిచేస్తున్న డాక్టర్ హేమరాజు పాల్గొయి , లండన్లోని శాస్త్రవేత్తలు , డెవలపర్లు , ఫ్యాకల్టీల సంఘం ( ఏఎస్ఈఎఫ్ ) నుంచి అత్యుత్తమ సమీక్షకుడిగా ప్రశంసా పత్రాన్ని మరోసారి పొందారు . ఈ విషయాన్ని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి . బ్రిటన్లోని గ్రీనిచ్ విశ్వవిద్యాలయం ‘ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఈ – గవర్నెన్స్’పై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ ప్రశంసా పత్రాన్ని పంపినట్టు తెలిపారు .

ఇంతకు మునుపు ‘ అమెరికన్ జర్నల్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ సంపాదకవర్గ ( ఎడిటోరియల్ బోర్డు ) సభ్యులలో ఒకరిగా 2018 లో డాక్టర్ హేమరాజు నియమితులయ్యారని , ఈ హోదాలో ఆయన పరిశోధక పత్రాలను సమీక్షించడంతో పాటు వాటి నాణ్యతను పెంపొందించేందుకు తోడ్పడుతున్నట్టు తెలియజేశారు . నెదర్లాండ్స్లోని ( ఆమ్నెస్టర్మ్ ) ఎల్వేర్ కాంపాజిట్ స్టిక్చర్స్ ఎడిటర్స్ 2017 లో అత్యుత్తమంగా సహకరిస్తున్న సమీక్షకుడిగా ప్రశంసా పత్రాన్ని అందజేసిందని , సెమి కండక్టర్స్ , ఆప్టోఎలక్ట్రానిక్స్ , నానోస్ట్రక్చర్స్పై 2022 ఏప్రిల్ 14-16 తేదీలలో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానిత ఉపన్యాసకుడిగా కూడా డాక్టర్ హేమరాజు గౌరవం పొందినట్టు వివరించారు .

ఉత్తమ సమీక్షకుడిగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన డాక్టర్ హేమరాజును గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , ఇంజనీరింగ్ డెరైక్టర్ ప్రొఫెసర్ నీకే మిట్టల్ , అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్ . సీతారామయ్య , పలువురు విభాగాధిపతులు , అధ్యాపకులు తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *