మనవార్తలు ,పటాన్చెరు
పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ లో ప్రారంభమైన బండల మల్లన్న జాతర మహోత్సవం లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి పరచనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, అమీన్పూర్ దేవానందం, జడ్పీటీసీలు సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్, రామచంద్రాపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, ఆదర్శ్ రెడ్డి, విజయ్ కుమార్, విజయ భాస్కర్ రెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.