మనవార్తలు ,మంచిర్యాల
ప్రతి ఒక్క జర్నలిస్టులు సమస్యలను పరిష్కరించే విధంగా ఏ బీ జే ఎఫ్ యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర కొర్ కమిటీ సభ్యులు పిల్లి.రవి కిరణ్ అన్నారు మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం అఖిలభారత జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం చెన్నూరు లోని చాణక్య డిగ్రీ కళాశాల లో చెన్నూరు నియోజక వర్గం ఏబీజే ఎఫ్ యూనియన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైనా రాష్ట్ర కొర్ కమిటీ సభ్యులు పిల్లి.రవి కిరణ్ జర్మలిస్టుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు .ప్రతి జర్మలిస్టు తమ వృత్తిని భాద్యత రహితంగా నిర్వహించాలని ,రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ. బీ. జే .ఎఫ్ ను విస్తరింపాజేయాలని సభ్యులందరికి సూచించారు. అలాగే జర్నలిస్టులకు ఎలాంటి సమస్యలనైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అఖిలభారత జర్నలిస్టుల ఫెడరేషన్ అనేది జర్నలిస్టుల యొక్క సంక్షేమ పథకాల కోసం జర్నలిస్టుల అభ్యున్నతికి ఎల్లవేళలా పోరాడి వారి ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.
జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైన ముందుండి ఏబిజెఫ్ ఎల్లవేళలా పోరాటం సాగిస్తుందని, అదేవిధంగా సభ్యత్వ నమోదు ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఏబిజేఫ్ సంఖ్యాబలాన్ని దేశవ్యాప్తంగా బలోపేతం చేయాలని నియోజకవర్గ అధ్యక్షుడు పళ్ళ.రాజశేఖర్ తెలిపారు.
ఈ కార్య క్రమం లో యూనియన్ సభ్యులు,గౌరవ అధ్యక్షులు,రామిడ్ల.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సాయి , కోశాధికారి సాయి సృజన్,పుణ్ణం మధుకర్, లింగరాజు, మధునేష్, రామిళ్ళ శీను, భవిష్యత్,సంతోష్, రఘు, పులి రాజారామ్, పిట్టల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.