మన వార్తలు , పటాన్ చెరు:
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల్ ఇంద్రేశం గ్రామ పంచాయతీ ప్రాథమికోన్నత పాఠశాలలో నేషనల్ పెన్ కాక్ సెలెట్ కరాటే పోటీలకు సెలెక్ట్ అయిన ,ఎస్ ప్రవీణ్ ,జి ,వికాస్ ,లకు ఆర్థిక సాయం అందజేసిన రామేశ్వరం బండ మాజీ ఎంపిటిసి అంతి రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ పోటీల్లో పాల్గొని విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేయడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అన్నారు జాతీయ పోటీలకు ఎంపిక చేసిన డ్రిల్ మాస్టర్ ప్రేమ్ ప్రేమ్ కుమార్ ను అభినందించారు.ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులను ప్రోత్సహించి మట్టిలో మాణిక్యం లాంటి విద్యార్థులను తీర్చిదిద్దడం ఆనందంగా ఉందని అన్నారు
ఇలాంటి అవకాశం కల్పించినందుకు ప్రధానోపాధ్యాయు ఏ శ్రీనివాసరావు కు ఎస్ఎంసి చైర్మన్ బండి పురుషోత్తం కు ధన్యవాదాలు తెలిపారు ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేసిన అంతి రెడ్డి కి మా స్కూల్ తరఫున పిల్లల తరఫున ధన్యవాదాలు తెలిపారు .
ఎస్ఎంసి చైర్మన్ బండి పురుషోత్తం మాట్లాడుతూ జాతీయ పోటీలకు ఎంపికైన విద్యార్థులకు ఆర్థిక సాయం చేసిన మాజీ ఎంపిటిసి అంతి రెడ్డి అన్నకు ధన్యవాదాలు మీలాంటి వాళ్ళు పేద విద్యార్థులకు సాయం చేసినంత వరకు విద్యార్థులు అన్ని పోటీల్లో పాల్గొనడానికి ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఏ శ్రీనివాసరావు, ఎస్ ఎం సి ,చైర్మన్ బండి పురుషోత్తం, పి, ఈ, టి, ప్రేమ్ కుమార్ ,పాల్గొన్నారు
