మన వార్తలు ,సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో గురుకుల పాఠశాల మూలమలుపు వద్ద గురువారం ఎస్ఐ చంద్రశేఖర్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టి వాహనాలకు ఎలాంటి లైసెన్స్ లేని వాటిని మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిని ఆపి వారికి చలానా విధించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా మాస్కులు లేకుండా త్రిబుల్ రైడింగ్, సరైన పత్రాలు మరియు హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న వారిని తనిఖీలు నిర్వహించి చలానా విధించామని తెలిపారు .కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు