గీతం స్కాలర్ చంద్రారెడ్డికి డాక్టరేట్…

Districts politics Telangana

మన వార్తలు ,పటాన్ చెరు:

‘ వెరైలెస్ సెన్సార్ నెట్వర్క్ కోసం సింగిల్ , బహుళ క్లస్టర్లలో శక్తి సంరక్షణ ‘ అనే అంశంపై అధ్యయనం , విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సెన్ట్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి కె . చంద్రారెడ్డిని డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.యుగంధర్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు .

వెరైస్ సెన్సార్ నెట్వర్క్లలో షెడ్యూలింగ్ , మార్గ ఎంపిక , నాణ్యత – ఆధారిత శక్తి పరిరక్షణ కోసం సమర్థమైన కమ్యూనికేషన్ విధానాన్ని అభివృద్ధి చేయడంపై ఈ పరిశోధన దృష్టి సారించినట్టు ఆయన తెలిపారు . నోడ్ స్థాయిలో రవాణా నియంత్రణ , క్లస్టర్ స్థాయిలో జోక్యాలను విశ్లేషించామన్నారు . శక్తిని ఆదా చేయడం , శక్తి ఆధారిత మార్గం ఎంపిక , నాణ్యతలో ద్వంద్వ పర్యవేక్షణలను ప్రతిపాదించినట్టు ఆయన వివరించారు . పరిష్కరించిన సమస్యను అధిగమించడానికి ఎనర్జీ గెయిన్ డెనమిక్ క్లస్టరింగ్ ( ఈజీడీఎం ) ని ఉపయోగించి కొత్త క్లస్టర్ ఫార్మేషన్ విధానాన్ని ప్రతిపాదించినట్టు డాక్టర్ యుగంధర్ తెలిపారు .

చంద్రారెడ్డి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , ఇంజనీరింగ్ డెరైక్టర్ ప్రొఫెసర్ వీకే మిట్టల్ , అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , పలువురు విభాగాధిపతులు , అధ్యాపకులు తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *