గీతమ్ ఫుడ్ టెక్నాలజీ ల్యాబ్ ప్రారంభం….

Districts politics Telangana

పటాన్ చెరు:

గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ఫుడ్ టెక్నాలజీ ల్యాబరేటరీని మంగళవారం బీ – స్కూల్ డెరైక్టర్ ప్రొఫెసర్ కరుణాకర్.బి ప్రారంభించి , ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శాస్త్రీయ ప్రదర్శనను కూడా తిలకించారు . ఈ ప్రదర్శనలో బాడీ మాస్ ఇండెక్స్ ( బీఎంఐ ) , ఆహారంలో కల్తీని కనుగొనే సాధనాలు , పలు పరిశోధనలకు ఉపకరించే పరికరాలను ప్రదర్శించారు . ఆ ప్రదర్శన తిలకించడానికి వచ్చిన వారందరికీ బీఎంఐ పరీక్షలు నిర్వహించి , అప్పటికప్పుడు ఫలితాలను వెల్లడించడం విశేషం .

ఈ కార్యక్రమంలో గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ వ్యవస్థాపక డెరైక్టర్ శ్రీధర్ పెబ్బిశెట్టి , పలువురు విద్యార్థులు పాల్గొన్నారు . ఫుడ్ సెన్స్డ్ , ప్యాకేజింగ్ , ఆవిష్కరణ రంగాలలో నెలకొని ఉన్న డిమాండ్ను తీర్చడానికి , కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయడానికి యువతలో ఉన్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని 2020 లో గీతమ్లో ఫుడ్ టెక్నాలజీ కోర్సును ఆరంభించినట్టు స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు తెలియజేశారు . పరిశ్రమ , ఆస్పత్రులు , విమానయాన రంగాలలో ప్యాక్ చేసిన ఆహారానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా ఔత్సాహిక యువత సొంత పరిశ్రమలు నెలకొల్పే యోచన చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *