విద్యా గణపతి దేవాలయ నిర్మాణానికి ఆర్ధిక సహాయం అందించిన గోదావరి అంజిరెడ్డి

Districts politics Telangana

మనవార్తలు ,రామచంద్రపురం

పటాన్చెరు నియోజకవర్గంలో ఎవరికి ఏ సహాయం కావాలన్న ఎస్ అర్ ట్రస్టు ఎల్లప్పుడూ ముందు ఉంటుందని ఎస్ అర్ ట్రస్టు అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి తెలిపారు. అమీన్పూర్ మున్సిపాలిటీలో సిగ్నొడు కాలనీ అధ్యరంలో నిర్మించబోయే విద్యా గణపతి దేవాలయం నిర్మాణానికి తనవంతు సాయంగా 25000 రూపాయలను రాష్ట్ర బిజెపి మాజీ మహిళా ప్రధాన కార్యదర్శి కాలనీ అధ్యక్షులు ఉమా మహేశ్రావు కీ  అందించారు.

​అనంతరం మాట్లాడుతూ దేవాలయ నిర్మాణల్లొ ఎస్ అర్ ట్రస్టు ఎల్లవేళలా అందుబాటులొ ఉంటుందని ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకోవాలని  ప్రజల్లో దైవ భక్తిని పెంపొందించేలా నూతన దేవాలయాన్ని నిర్మించడం చాలా సంతోషకరమన్నారు.నియోజవర్గంలోని ప్రతి గ్రామంలో దేవాలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎస్ అర్ ట్రస్టు అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి అధ్యక్షులు రవీందర్ రెడ్డి, బిజెపి జిల్లా నాయకులు పరమేశ్వర్ రెడ్డి ,ప్రభాకర్, అశోక్, రాజు, ధనుజయ రావు మరియు సిగ్నొడు ఎంప్లొయీస్, కాలనీ వాసులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *