గీతం స్కాలర్ జగన్మోహన్ రెడ్డికి డాక్టరేట్

Districts politics Telangana

మన వార్తలు ,పటాన్‌చెరు:

గ్యాస్ సెన్సార్ వినియోగం కోసం జింక్ ఆధారిత లోహ సేంద్రియ విధానంలో నానో మిశ్రమాల సంశ్లేషణ, ఆనవాలు లక్షణ చిత్రణ అనే అంశంపై అధ్యయనం, విశ్లేషణ, దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి ఎ.జగన్మోహన్ రెడ్డి ని డాక్టరేట్ వరించింది. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెర్చ్ లోని రసాయన శాస్త్ర ప్రొఫెసర్లు డాక్టర్ ఎం.ఎస్.సురేంద్రబాబు, డాక్టర్ నరేష్ కుమార్ కటారిలు శుక్రవారం వెల్లడించారు.

సంశ్లేషణ, అత్యంత సున్నితమైన, వేగంగా తిరిగి పొందగలిగే శీఘ్ర ప్రతిస్పందన గ్యాస్ సెన్సార్లు ఈ పరిశోధన లక్ష్యమన్నారు. అధిక ఎంపికతో తక్కువ ప్రతిస్పందన సమయం కోసం పరిశోధనలు విశ్వవ్యాప్తంగా పురోగతిలో ఉన్నాయని, కొత్త గ్యాస్ సెన్సార్ల అభివృద్ధికి పరిశోధన చాలా అవశ్యమని వారు తెలిపారు. గ్యాస్ సెన్సింగ్ అధ్యయనాల కోసం అమ్మోనియా, ఫార్మాల్డిహెడ్జ్, ఇథనాల్, ఆసిటోన్, టోలున్, జిలీన్ ఆవిరిని ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్‌డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సెర్చ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు, పలువురు విభాగాధిపతులు, అధ్యాపకులు తదితరులు అభినందించినట్టు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *