పటాన్‌చెరు:
ముఖ్యమంత్రి కేసీఆర్ ది కపట నాటకమని పటాన్‌చెరు మాజీ జడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని ముత్తంగి బీజేపీ కార్యాలయంలో గడీల శ్రీకాంత్ గౌడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహా ధర్నా ఓక నాటకమని, అందులో కేసీఆర్ మహానటుడని విమర్శించారు.
రైతులపై కేసీఆర్ కపట నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఉన్న వడ్లు కొనకుండా తరువాత వాటిపై ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ధర్నా పేరుతో సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ, రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఓక అవకాశ వాది అని, ఇన్నాళ్ళు ఫాం హౌస్ లో ఉండి ఇప్పుడు బీజేపీ పట్ల పెరుగుతున్న జనం స్పందన చూసి ఏం మాట్లాడాలో, ఏం చేయాలో తోచక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని తెలిపారు.
ఇలా ధర్నాలు చేయాలనుకుంటే టీఆర్ఎస్ నాయకులు చేతనైతే ఈ ఏడున్నర ఏళ్ళుగా కేసీఆర్ హామిలిచ్చిన దళిత ముఖ్యమంత్రి, డబుల్ బెడ్ రూం, దళిత బంధు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, డబుల్ బెడ్ రూం ఇలాంటి వందలాది స్కీములపై చేయాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చి, ఉన్న ఉద్యోగాలు కూడా తీసేసినా ఘనత కేసీఆర్ కె దక్కుతుందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షులు ఈశ్వరయ్య, నాయకులు దేవేందర్ గౌడ్, శివా, సాయి తదితరులు పాల్గొన్నారు.
