మనవార్తలు పటాన్చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 18-20 తేదీలలో ‘డెటా సైన్స్’పై మూడు రోజల అధ్యాపక వికాస కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్ మంగళవారం తెలియజేశారు. డేటా సైన్స్ అనేది శాస్త్రీయ పద్ధతులు, ప్రక్రియలు, అల్గారిథమ్‌లు, కంప్యూటర్లను ఉపయోగించే ఒక అంతర్ విభాగం రంగమని, ఇది గణాంకాలు, సమాచార విశ్లేషణ, కంప్యూటర్ శాస్త్రం, వాటి సంబంధిత పద్ధతులను ఏకీకృతం చేయడానికి తోడ్పడుతుందన్నారు.
ఈ అధ్యాపక వికాస కార్యక్రమంలో పాల్గొనేవారు ఆయా అంశాలపై లోతైన అవగాహనను ఏర్పరచుకోవడంతో పాటు అత్యాధునిక సాంకేతికతను అనుభవపూర్వకంగా తెలుసుకునే వీలుందని తెలిపారు. భారత గణాంక సంస్థకు చెందిన ప్రొఫెసర్ జీఎస్ఆర్ మూర్తి, గీతం ని గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మోతహర్ రజా, సీఎస్సీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ రాహుల్ రాయ్ లు ఈ మూడు రోజుల కార్యక్రమంలో ప్రధాన వక్తలుగా పాల్గొంటారని ఆయన వివరించారు. ఇందులో పాల్గొన దలచినవారు పేర్ల నమోదు, వసతి తదితర వివరాల కోసం కార్యక్రమ సమన్వయకర్త సౌరవ్ బిస్వాస్ (70036 17793) ని సంప్రదించాలని లేదా sbiswas@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని డాక్టర్ ఫణికుమార్ సూచించారు.
