గుమ్మడిదల
ప్రతి పేదవాడికి నేనున్నా అంటూ ఆపదలో ఉన్నవారికి అదుకొంటూ సాయం అడిగిన వారికి సాయంగా నిలుస్తూ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చిట్కుల్ సర్పంచ్ నీలం మధు మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో సంపంగి జములమ్మ భర్త లక్ష్మయ్యల కుమారులు ఇద్దరు గత నెల క్రితం నరసింహ, సంతోష్ అనే యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. అలాగే తన భర్త అయినటువంటి లక్ష్మయ్యకు కాళ్లు చేతులు పడిపోయాయి .
ఆపదలో ఉన్నారని తెలుసుకున్న ఎన్ఎంఎం యువసేన సభ్యులు సర్పంచు నీలం మధు కు తెలపడంతో వెంటనే వారికి సహాయంగా 5000 రూపాయలు పంపించారు ఎన్ఎంఎం యువసేన సభ్యులు లక్ష్మయ్య ఇంటికి వెళ్లి 5000 రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ గ్రామ పంచాయితీ వార్డు సభ్యులు కావలి ఐలేష్, యువ నాయకులు వడ్డే రాజు, బాల్రాజ్, పాండు, శ్రీనివాస్, మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.