మనవార్తలు , శేరిలింగంపల్లి :
కోకా కోలా కంపెనీ లో పని చేస్తున్నటువంటి సత్యనారాయణ అనే కార్మికుని మేనకోడలుకు ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్న దానికి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎల్. రూప్సింగ్ గారి సహకారంతో తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయిన్ పల్లి వినోద్ సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ 26 వేల రూపాయలు చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోకో కోలా కంపెనీ టి ఆర్ ఎస్ కె వి జనరల్ సెక్రెటరీ ఆశ స్వామి, వైస్ ప్రెసిడెంట్ సల్వాది వెంకటయ్య పాల్గొన్నారు.