పటాన్చెరు
దేశంలోని విభిన్న సంస్కృతులకు నిలయం గా పటాన్చెరు నియోజకవర్గం నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఉత్తర భారతీయులు పవిత్రంగా నిర్వహించుకునే ఛట్ పూజా కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని 28 రాష్ట్రాల ప్రజలు పటాన్చెరు నియోజకవర్గంలో జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అందరికీ సమ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యేనీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, గూడెం మధుసూదన్ రెడ్డి, సందీప్ షా, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన మహిళలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.