ఐవోటీపై గీతంలో అధ్యాపక వికాస కార్యక్రమం

Districts Telangana

పటాన్ చెరు:

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పై ఈనెల 11 నుంచి 13 వ తేదీ వరకు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో అధ్యాపక వికాస కార్యక్రమాన్ని (ఎఫ్ డీపీ) నిర్వహించనున్నట్టు ఆ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్ మంగళవారం పేర్కొన్నారు. అధ్యాపకుల నెపుణ్యాలను పెంపొందించడంతో పాటు వారు ప్రపంచ స్థాయి సామర్థ్యాలను సంపాదించాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందులో అధ్యాపకులతో పాటు పరిశోధక – పీజీ విద్యార్థులు, పరిశ్రమకు చెందిన వారు కూడా పాల్గొనవచ్చన్నారు. ఈ ఎఫ్ డీపీలో పాల్గొనే వారందరికీ రాస్ప్బెర్రీ కిట్ తో పాటు ప్రశంసా పత్రం కూడా ఇస్తామని తెలియజేశారు. పరిమిత సంఖ్యలో సీట్లు ఉన్నందున, ముందుగా పేరు నమోదు చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యం ఉంటుందన్నారు. పేర్ల నమోదు, రుసుము తదితర వివరాల కోసం సదస్సు సమన్వయకర్త డాక్టర్ ప్రవీణ్ ముండే (91402 75365) ను సంప్రదించాలని లేదా pmundhe@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *