రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ సంక్షేమ సంఘం ఎన్నిక

Hyderabad politics Telangana

శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్ పరిధిలో గల రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ సంక్షేమ మరియు కల్చరర్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం రోజు ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా తులసిరాం, జనార్దన్, రాఘవ రెడ్డి లు వ్యవహరించగా నూతన అధ్యక్షులుగా జూపల్లి శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షుడు గా ఎం, వెంకటేష్, ప్రధాన కార్యదర్శి గా సురేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ గా రేణుక, ట్రెజరర్ గా రామ మూర్తి లు ఎన్నికవ్వగా ఎగ్జిక్యూటివ్ మెంబర్లు గా ప్రమీల, ఇసప్ప, రమాదేవి, చిన్న పుల్లారెడ్డి, ప్రకాష్ రావు, సీతారత్నం, కొండపల్లి సురేష్, రజనీకాంత్, చంద్రమౌళి లు ఎన్నికయ్యారు.అందరం కలిసికట్టుగా ఉంటూ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామని సభ్యులు తెలిపారు.భేషజాలు లేకుండా సమస్యలు లేని కాలనీ గా ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతామని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో బాల్ రెడ్డి, నిర్మల, శృతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *