మనవార్తలు , శేరిలింగంపల్లి :
టీఆరెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి పలువురు యువకులు తెరాస పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.గచ్చిబౌలి డివిజన్ ఖాజాగూడా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్, శాసనసభ్యులు అరికెపుడి గాంధీ నేతృత్వంలో గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో రావులకొల్లు గోవింద్, పురిడి కృష్ణ మరియు యూత్ శివ రాజ్,సంతోష్ రాజ్, రామకృష్ణ, హరికృష్ణ, హరిశంకర్, సాయిదీప్, అజయ్, శివ, శరత్ యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. శాసనసభ్యులు అరికెపుడి గాంధీ, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా కలిసి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ తెరాస పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
