– 29 విభాగాల్లో అవార్డులు అందించిన హై బిజ్ టీవీ
మనవార్తలు ,శేరిలింగంపల్లి :
వైద్యో నారాయణో హరిః అంటే వైద్యులు దేవుడితో సమానం అని అర్థం. తల్లి జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మను ప్రసాదిస్తారు. ప్రాణ రక్షకులుగా, సలహాదారులుగా, శ్రేయోభిలాషులుగా రోగులకు అండగా నిలుస్తారు. తమ వృత్తినే దైవంగా భావించి సేవ చేస్తారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వైద్యులు తమ అమూల్యమైన సేవలను అందించారు. లక్షలాది మంది ప్రాణాలను కాపాడారు. అలాంటి డాక్టర్లను హై బిజ్ టీవీ ఘనంగా సత్కరించింది. వైద్య రంగంలో అపారమైన సేవలు అందిస్తున్న డాక్టర్లు, ఇతర ప్రముఖులు, ఆస్పత్రులకు పురస్కారాల ఇచ్చి గౌరవించింది. మొత్తం 29 విభాగాల్లో అవార్డులను అందజేసింది.
హైదరాబాద్ గచ్చిబౌలి లోని సంధ్య కన్వెన్షన్ వేదికగా అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శాంతా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ మరియు చైర్మన్ వర ప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ఎంపీ. బూర నర్సయ్య గౌడ్, సన్ షైన్ హాస్పిటల్ హెచ్.ఒ.డి సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్ వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ కస్తూరి, జేబీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఎం.డి. రాజ్ గోపాల్, సినీ హీరోయిన్ లు కామ్నా జెఠ్మలానీ, నందిత శ్వేత లు, డైరెక్టర్ జనరల్, ఫార్మ్ ఎక్సిల్ రవి ఉదయ్ భాస్కర్, ఏ.వి.పి.ఎస్ గ్లోబల్ అంబాసిడర్, వరల్డ్ ప్యాకేజింగ్ ఆర్గనైజేషన్ చక్రవర్తి, తదితరులు ఇందులో పాల్గొన్నారు.

డిజిటల్ మీడియా రంగంలో హై బిజ్ టీవీ ఒక సంచలనం. 12 సంవత్సరాలుగా వీక్షకుల ఆదరాభిమానాలు చూరగొంటున్న మాధ్యమం. హై బిజ్ టీవీ అంటేనే బిజినెస్ వీడియోల లైబ్రరీ. బిజినెస్ రంగానికి సంబంధించి దాదాపు లక్ష వీడియోలను ఈ 12 యేళ్ళ కాలంలో హై బిజ్ టీవీ తన వీక్షకులకు అందిస్తూ వస్తోంది. మన దేశంలోనే ఆన్ లైన్ బిజినెస్ టీవీల్లో లీడింగ్ పొజిషన్ లో కొనసాగుతోంది. హై బిజ్ టీవీ గతంలో పలు విభాగాల్లో అవార్డులను అందజేసింది. ఉమెన్స్ లీడర్ షిప్ అవార్డ్స్ 2020, 2021 మీడియా అవార్డ్స్ 2021 వంటి కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించింది.
వాటి స్పూర్తితో హై బిజ్ టీవీ హెల్త్ కేర్ అవార్డ్స్ కు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే.. కార్డియాలజీ, సీటీ సర్జరీ, న్యూరాలజిస్ట్, ఆర్థోపెడిక్స్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, యూరాలజీ, పీడియాట్రిక్స్, పీడియాట్రిక్ సర్జరీ, అనెస్థిటిక్స్ కేటగిరీల్లో అవార్డులు ఇచ్చింది. అలాగే, నెఫ్రాలజీ, ఇ.ఎన్.టి, ఆప్తాల్మాలజీ, గైనకాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, డెర్మటాలజీ, డయాబెటాలజీ, జనరల్ ఫిజీషియన్, ఎండోక్రినాలజిస్ట్, వ్యాస్కులర్ సర్జరీ, ఆంకాలజీ, హెమటాలజీ విభాగాల్లో పురస్కారాలను అందజేసింది.
వీటితో పాటుగా రేడియాలజిస్ట్, సైకాలజిస్ట్, రుమటాలజీ, జనరల్ సర్జరీ, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, పల్మనాలజిస్ట్, డాక్టర్, పొలిటీషియన్, డాక్టర్ ఆర్టిస్ట్, ఎక్స్ ట్రార్డినరీ స్కిల్డ్ డాక్టర్ కేటగిరీల్లో అవార్డులు ప్రదానం చేసింది. వైద్య విభాగంలో ట్రైల్ బ్లేజర్, లెజెండ్స్, లైఫ్ టైమ్.. ఆస్పత్రుల్లో సింగిల్, మల్టీ స్పెషాలిటీ విభాగాల్లో పురస్కారాలను ఇచ్చింది. ఈ అవార్డులకు సంబంధించిన విజేతలను డాక్టర్ శ్రీధర్ కస్తూరి, డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ నేతృత్వంలోని జ్యూరీ సభ్యులు ఎంపిక చేశారు. అత్యంత పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ జరిగింది. హై బిజ్ టీవీ హెల్త్ కేర్ అవార్డ్స్ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. హై బిజ్ టీవీ హెల్త్ కేర్ అవార్డ్స్ కు పీఆర్ పార్ట్ నర్ గా మ్యాడి కామ్, వెన్యూ పార్ట్ నర్ గా సంధ్య కన్వెన్షన్, ఈవెంట్ పార్ట్ నర్ గా ట్రియో వ్యవహరించాయి
