హుజురాబాద్ లో ఈటల రాజేంద్రా గెలుపు కాయం _నందీశ్వ‌ర్ గౌడ్

Districts Telangana

ప‌టాన్ చెరు:

హుజురాబాద్ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుపును ఎవ‌రూ ఆప‌లేర‌ని ప‌టాన్ చెరు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీ . నందీశ్వ‌ర్ గౌడ్ ధీమా వ్య‌క్తం చేశారు . హుజురాబాద్ లో గ‌త ప‌ది రోజ‌లుగా ప్ర‌చారం నిర్వ‌హించామ‌ని అక్క‌డి ప్ర‌జ‌లు బీజేపీకే పట్టం క‌ట్ట‌డం ఖాయ‌మ‌న్నారు . ప్ర‌ధాని మోడీ తీసుకువ‌చ్చిన ప‌థ‌కాలు , దేశసుస్థిర‌త కోసం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు , ఈటెల రాజేంద‌ర్ కు ఉన్న సానుభూతి హుజురాబాద్ ఎన్నిక‌ల్లో పని చేసింద‌న్నారు .

తాము ప‌ర్య‌టించిన మండ‌లాల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఎక్కువ‌గా క‌న్పించింద‌ని అక్టోబ‌ర్ 30 వ తేదీన జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓటర్లు ఈటెల రాజేంద‌ర్ కు ప‌ట్టంక‌ట్టిన‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపించింద‌న్నారు . 20 నుంచి 30 వేల ఓట్ల మోజార్టీతో బీజేపీ అభ్య‌ర్థి ఈటెల రాజేంద‌ర్ గెలుపు ఖాయ‌మ‌ని నందీశ్వ‌ర్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు .తెలంగాణ ప్ర‌భుత్వ అహంకారానికి ఆత్మ‌గౌర‌వానికి మ‌ధ్య జ‌రిగిన ఎన్నిక‌లుగా నందీశ్వ‌ర్ గౌడ్ అభివ‌ర్ణించారు. ఈటెల‌ను ఓడించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజ‌క‌వ‌ర్గంలో కోట్లు కుమ్మ‌రించార‌ని విమ‌ర్శంచారు. ఎగ్జిట్ పోల్స్ సైతం బీజేపీ గెలుపు ఖాయ‌మ‌ని ప్ర‌క‌టించాయ‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *