చిట్కుల్
ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం చిత్రపటాన్ని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ కు శ్రీశైలం దేవస్థానం ఉద్యోగి బహుకరించారు. శ్రీశైలం దేవస్థానంలో పని చేసే పి. విశ్వం సోమవారం పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలో సర్పంచ్ నీలం మధును కలిశారు. ఈ సందర్బంగా శ్రీశైలం నుంచి తీసుకొచ్చిన మల్లికార్జున స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. సర్పంచ్ నీలం మధుకు ప్రేమతో తీసుకొచ్చిన స్వామివారి చిత్రపట జ్ఞాపికను బహుకరించి, శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆంజనేయులు, భుజంగం, దుర్గయ్య, మురళి పాల్గొన్నారు.