చిట్కుల్
పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలోని ఎన్ ఎంఎం యువసేన ఆధ్వర్యంలో పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి పుస్తె మెట్టెలు బహుకరించారు. పటాన్ చెరు పట్టణానికి చెందిన బైండ్ల శారద, కృష్ణ దంపతుల కుమార్తె భవాని వివాహం కోసం తమ వంతుగా ఎన్ఎంఎం యువసేన సభ్యులు పుస్తె మెట్టెలు అందించారు. శనివారం చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ చేతుల మీదుగా వధువు కుటుంబ సభ్యునికి పుస్తె మెట్టెలను అందజేశారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పేదలకు అండగా నిలవాలని కోరారు.
పేదింటి ఆడబిడ్డ పెళ్లికి పుస్తె మెట్టెలు అందించినందుకు ఎన్ఎంఎం యువసేన సభ్యులకు ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో యువసేన సభ్యులు బాలు ముదిరాజ్, శ్రీకాంత్ పాల్గొన్నారు